ETV Bharat / state

కలెక్టరేట్​ భవన నిర్మాణ ప్రగతిపై కలెక్టర్​ తీవ్ర అసంతృప్తి - నాగర్​కర్నూలు జిల్లా వార్తలు

నాగర్​కర్నూలు జిల్లా కలెక్టరేట్​లో జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ ఆర్​ అండ్​ బీ, ఇంజినీరింగ్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో డబుల్​ బెడ్​రూం ఇళ్లు, జిల్లా కోర్టు సముదాయ భవనం, గోదాం నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్​ నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్​ను బ్లాక్​లిస్టులో ఉంచేందుకు నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు.

nagarkarnool-collecor-reviw-on-development-works-in-district
జిల్లాలో పలు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్​
author img

By

Published : Jun 10, 2020, 7:15 PM IST

డబుల్​బెడ్​ రూం ఇళ్లు, జిల్లా కోర్టు సముదాయ భవనo, గోదాం నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నాగర్​కర్నూలు జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్​ను బ్లాక్ లిస్ట్​లో ఉంచడానికి నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. కలెక్టరేట్​లో జిల్లా పాలనాధికారి శ్రీధర్ ఆర్ అండ్ బీ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 3816 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు కాగా 1235 ఇళ్లకు టెండర్ ప్రక్రియ ముగియగా... 767 ఇళ్లకు వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వాటిని మూడు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టెండర్ ప్రక్రియ ముగిసినా 262 ఇళ్ల పనులు ప్రారంభం కాకపోవడం వల్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

నూతన కలెక్టరేట్ సముదాయ భవనం నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవన నిర్మాణంలో ఏమాత్రం పురోగతి లేదని.. ఇప్పటివరకు బేస్​మెంట్​ లెవెల్ మాత్రమే పూర్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్​ను బ్లాక్ లిస్టులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని అదనపు కలెక్టర్ మను చౌదరికి సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కోర్టు సముదాయ భవనాన్ని ఒక మాసంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: కరోనా బాధితులకు ఇంటివద్దే చికిత్స: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.