ETV Bharat / state

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్​ శర్మన్ - నాగర్​ కర్నూలు జిల్లా వార్తలు

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్​ కర్నూలు జిల్లా కలెక్టర్‌ శర్మన్ హెచ్చరించారు. మంగళవారం పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాల పరిధిలోని తడకలవారి తండా, జటప్రోల్, కొండూరు కల్వకోల్, జొన్నలబొగుడ, జొన్నలబొగుడ తండా, సాతాపూర్ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించారు.

nagar karnool district collector inspection villages and issued notice to officers
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్​ శర్మన్
author img

By

Published : Aug 25, 2020, 10:59 PM IST

నాగర్​ కర్నూలు జిల్లా కలెక్టర్‌ శర్మన్ పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాల పరిధిలోని తడకలవారి తండా, జటప్రోల్, కొండూరు కల్వకోల్, జొన్నలబొగుడ, జొన్నలబొగుడ తండా, సాతాపూర్ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో అందుబాటులో లేని పెంట్లవెల్లి ఎంపీవోకు, 4 గ్రామాల కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

తడకలవారి తండాలో గ్రామస్థులు ఆరుబయటే బహిర్భూమికి వెళ్తుండడం పట్ల సర్పంచ్​పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ శర్మన్ హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వీటిపై సర్పంచులు, కార్యదర్శులు దృష్టి సారించడం లేదని కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి- వ్యాక్సిన్​ ఉత్పత్తిలో భారత్​ సాయం కోరిన రష్యా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.