కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా వామపక్ష పార్టీల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని జామియా మసీదు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. పౌరసత్వ బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భాజపా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా బిల్లును ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు