కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ చేపట్టిన రాజీవ్ రైతు భరోసా యాత్ర 6వ రోజు కొనసాగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొంపేట దేవస్థానం నుంచి యాత్ర జరుగుతోంది. గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్న రేవంత్‌రెడ్డికి పల్లె ప్రజలు... బోనాలు, మంగళహారతులతో స్వాగతం పలికారు.
రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్ యార్డులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి మోదీ కంకణం కట్టుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఐకేపీ, మార్కెట్ కేంద్రాలు తీసేసి మద్దతు ధర కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ వెంట పాదయాత్రలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, మాజీ ఎంపీ మల్లురవి ఉన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి కాబట్టే... మనమందరం చైతన్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి. అందరం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన అవసరముంది. నరేంద్ర మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలపై మనమందరం యుద్ధం చేసి వాళ్లను గద్దె దించుదాం. రైతులను కాపాడుకుందాం.
--- రైతు భరోసా పాదయాత్రలో రేవంత్‌రెడ్డి
ఇదీ చూడండి: తెరాస హామీలు ఇంకా నెరవేరలేదు: జానారెడ్డి