నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో తెరాస పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. తెరాస అభ్యర్థులకు మద్దతుగా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి సతీమణి విజయమ్మ ప్రచారంలో భాగంగా వార్డులో ఉన్న చిన్నారులకు స్నానం చేయిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి వెళ్తూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తెరాస పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. కేసీఆర్ నాయకత్వంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తుంని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'