నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాఠ్యపుస్తకాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులు సర్కార్ కల్పిస్తోందని తెలిపారు. అయితే ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్నందున పాఠశాలలను తెరవాల వద్దా అంశంపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించే పనిలో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఉపాధ్యాయులు, విద్యార్థులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెరాస గ్రామ అధ్యక్షుడి కుటుంబాన్ని జైపాల్ యాదవ్ పరామర్శించారు. వెల్దండ మండల కేంద్రంలో రైతు ఆగ్రో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, ఆయా మండలాలకు చెందిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?