అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని నాగర్‌కర్నూల్ జిల్లా నూతన కలెక్టర్ ఎల్.శర్మన్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు హనుమంత్‌రెడ్డి, మనూ చౌదరి, డీఆర్వో మధుసూదన్ నాయక్, పలువురు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కరోనా పరిస్థితులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాల ద్వారా జిల్లాను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలులో జిల్లా ముందుండాలని సూచించారు. త్వరలోనే అన్ని శాఖల వారీగా సమీక్ష నిర్వహించి చర్చిస్తామని ఆయన తెలిపారు.
ఇదీచూడండి: రైల్వేకు తీవ్రంగా నష్టం కలిగించే ప్రైవేటు రైళ్లు వద్దేవద్దు..