నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో 50 మంది మున్సిపల్ సిబ్బందికి ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి నిత్యావసర సరకులు అందజేశారు. మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. కరోనా ఎదుర్కొనేందుకు 24 గంటలు పనిచేస్తున్నారని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యమంలో కమిషనర్ వెంకటయ్య, ఎంపీపీ సుధారాణి, మున్సిపల్ ఛైర్మన్ విజయలక్ష్మీ, వైస్ ఛైర్పర్సన్ హిముదా బేగం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఫోన్ కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి