ETV Bharat / state

ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. గోతులు తవ్వేస్తున్నారు! - telangana news

ఖాళీ జాగాపై కన్ను పడిందంటే చాలు.. రాత్రికి రాత్రే యంత్రాలతో గద్దల్లా వాలుతారు. తెల్లారేసరికి లోయలను తలపించేలా గోతులు తవ్వేస్తారు. అధికారులకు సెలవులు వస్తున్నాయంటే వారికి అడ్డూ అదుపూ ఉండదు. చట్టాలకు తూట్లు పొడుస్తూ.. ప్రభుత్వానికి రుసుములు ఎగ్గొడుతూ.. సామాజిక ఆస్తులను ధ్వంసం చేస్తూ రూ. లక్షలు దండుకుంటారు. సంక్రాంతి నేపథ్యంలో వరుసగా సెలవులు రావటంతో అక్రమార్కులంతా రెచ్చిపోయారు. నాగర్​కర్నూల్ జిల్లాలో మట్టి దందా సాగుతున్న తీరుపై ఈటీవీ భారత్​ కథనం.

illegal excavations in government lands at nagarkurnool district
నాగర్​కర్నూల్​లో మట్టి దందా
author img

By

Published : Jan 23, 2021, 3:37 PM IST

నాగర్​ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ భూములే అక్రమమార్కుల మట్టి దందాకు అడ్డాలుగా మారాయి. ఊర్కొండ, బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, తాడూరు, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ తదితర ప్రాంతాల్లో ఇది ఇష్టారాజ్యంగా సాగుతోంది. ముఖ్యంగా కేఎల్‌ఐ ప్రధాన కాలువ వెంట మట్టిని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ పనులు చేపడుతున్న గుత్తేదారులు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. రాత్రీ పగలు అనకుండా అధిక లోడుతో టిప్పర్ల ద్వారా మట్టిని తరలించటంతో రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిని రూ. కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. అక్రమ తవ్వకాలు, అమ్మకాలు కళ్లదుటే సాగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి.

పట్టించుకునేవారే లేరు

బిజినేపల్లి మండలంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ పనుల కోసం అందుబాటులో ఇసుక, మట్టి లేకపోవటం వల్ల వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కేఎల్‌ఐ కాలువ వెంట ఉన్న మట్టిని రైతుల పేరుతో అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా తరలించి డబ్బులు దండుకొంటున్నారు. పాలెం, మమ్మాయిపల్లి, మంగనూరు గ్రామాలలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు.

మట్టే కదా అని ఊరుకుంటే..

నాగర్‌కర్నూల్‌, పెద్దకొత్తపల్లి మండలాల్లో ఇదే దందా దర్జాగా కొనసాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి. మట్టే కదా అని ఊరుకుంటే తెల్లవారేసరికి ప్రమాదకరంగా భారీ గోతులను తయారు చేస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

రోజురోజుకు మాయమవుతోంది

కల్వకుర్తి సమీపంలో కేఎల్‌ఐ ప్రధాన కాలువ తవ్వకాల్లో బయటికి వచ్చిన మట్టి రోజురోజుకు మాయమవుతోంది. తర్నికల్‌, పంజుగుల, కుర్మిద్ద, వెల్దండ మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. కేఎల్‌ఐ కాలువల వెంట మట్టి తరలించటంతో ఏర్పడిన ఖాళీ స్థలాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వం కాలువ నిర్మాణ సమయంలో భూములు ఇచ్చినవారికి పరిహారం చెల్లించింది. ఆయా భూములు మళ్లీ ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

దెబ్బతిన్న రహదారి

ఊర్కొండ మండలం జగబోయిన్‌పల్లి సమీపంలోని 59 సర్వే నంబరు ప్రభుత్వ భూమి నుంచి ఓ ప్రైవేట్‌ మిల్లు నిర్మాణం కోసం అక్రమంగా దాదాపు రెండు నెలల నుంచి మట్టిని తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో వాటర్‌షెడ్‌ పథకంలో భాగంగా గతంలో భూగర్భ జలాల పెంపునకు చెక్‌డ్యాం ఏర్పాటు చేశారు. మట్టి తరలించటంతో చెక్‌డ్యాం పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సంక్రాంతి సెలవుల్లో ఇక్కడి నుంచి టిప్పర్ల ద్వారా భారీగా మట్టిని తరలించారు. అధికంగా లోడుతో టిప్పర్లు రాకపోకలు సాగించటంతో జగబోయిన్‌పల్లి నుంచి 3 కి.మీ.ల మేర తారు రహదారి పూర్తిగా దెబ్బతింది.

భారీ గోతులు

ఊర్కొండ మండల కేంద్రంలో గుట్టల మధ్య ప్రభుత్వ భూముల నుంచి 167 జాతీయ రహదారి నిర్మాణానికి మట్టిని తరలించి భారీ గోతులు చేశారు. గుత్తేదారు ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. సమీప రైతుల ఆందోళనతో గుత్తేదారు మట్టి తరలించే పనుల ఆపారు. రహదారి నిర్మాణ సమయంలో దారికి కావాల్సిన మట్టి కోసం భూమిని కొనుగోలు చేసి సమకూర్చుకోవాలని నిబంధనలు ఉన్నా.. వారు అక్రమ పద్ధతుల్లో పనులు పూర్తిచేశారని ఉర్కొండ ప్రజలు ఆరోపిస్తున్నారు.

మట్టిని తరలిస్తే చర్యలు తప్పవు

అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు చేపడతాం. సెలవు రోజుల్లో ఇది ఎక్కువగా జరుగుతోందన్న మాట వాస్తవమే. మట్టిని ఎక్కడికి తరలించారో ఆరాతీసి వారిపై చర్యలు తీసుకొంటాం. ఉర్కొండ మండలంలో మట్టి తవ్వకాలు అధికంగా జరగకుండా చర్యలు తీసుకొంటాం. కేఎల్‌ఐ కాలువల వెంట ఉన్న మట్టిని అక్రమంగా తరలించటంపై నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తాం.

- రాజేశ్‌కుమార్‌, కల్వకుర్తి ఆర్డీవో

రహదారి పరిస్థితిని పరిశీలిస్తాం.

వాహనాల్లో అధిక లోడుతో మట్టిని తరలించటంతో ఉర్కొండ మండలం జగబోయిన్‌పల్లి - వెల్‌జాల్‌ రహదారి పూర్తి దెబ్బతిందని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి మట్టిని తరలించటానికి వాడిన వాహనాలు, పనులు చేపడుతున్న యాజమానులపై చర్యలు తీసుకొంటాం.

- దుర్గాప్రసాద్‌, పంచాయతీరాజ్‌ శాఖ డీఈఈ, కల్వకుర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.