ETV Bharat / state

ఈదురుగాలులతో కూడిన వర్షం.. దెబ్బతిన్న చెంచుల గుడిసెలు - huts of Chinchillas damaged in nallamala forest

నాగర్​ కర్నూల్​ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని రాంపూర్​ చెంచు పెంటలో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెంచుల గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ గుడిసెల్లో నివసించే వారు నిరాశ్రయులయ్యారు.

rain in nallamala forest
నల్లమల అడవుల్లో వర్షం
author img

By

Published : Apr 21, 2021, 3:23 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని రాంపూర్ చెంచు పెంటలో నిన్న ఈదురు గాలులతో కూడిన వర్షం.. చెంచులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. 12 చెంచు కుటుంబాలకు చెందిన గుడిసెలు పూర్తిగా దెబ్బతినడంతో వారు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం చెట్ల కింద ఆశ్రయం పొందుతున్నారు.

ఇక్కడ మొత్తం 22 చెంచు కుటుంబాలు అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. వీరికి గతంలో ఆర్డీటీ వారు పక్కా గృహాలు మంజూరు చేసినా అటవీశాఖ అనుమతించకపోవటంతో నిర్మించలేదు. కొద్ది రోజుల కిందట అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన రాంపూర్ చెంచుల్లో ముగ్గురు.. అక్కడ చెలరేగిన మంటల్లో చిక్కుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. తాము అడవిని నమ్ముకుని జీవిస్తున్నామని.. నిరాశ్రయులైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెంచులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ కోలుకోవాలంటూ నిర్మల్​లో ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.