నాగర్‌కర్నూల్ జిల్లా చేగుంట గ్రామం వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సాగునీరు చెరువులు కుంటలు నింపాలని చేగుంట, గోరింట, వెల్కిచర్ల గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేశారు. తిమ్మాజీపేట మండలంలోని వెల్కిచర్ల చేగుంట గ్రామంలోని సుమారు పదిహేను కుంటలు, చెరువులు నింపితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా అధికారులకు నాయకులకు చెప్పినా ఎవరూ పట్టించుకో లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లాభం లేదని ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వంటావార్పు చేశారు. ధర్నాతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఇవీ చూడండి: నేడు తెరాస విస్తృత స్థాయి సమావేశం