ETV Bharat / state

Food Poison in Nagarkurnool : కలుషిత ఆహారం కలకలం.. 40 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత - కలుషిత ఆహారం

Food Poison in Nagarkurnool : కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మన్ననూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో.. రాత్రి భోజనం చేశాక 40 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 10 మంది విద్యార్థినులు కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది.. వారిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురి విద్యార్థినులకు నాగర్​కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స ఇస్తున్నారు.

Food Poisoning in Nagarkurnool
Nagarkurnool
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 9:49 AM IST

Food Poisoning in Nagarkurnool నాగర్‌కర్నూల్​లో కలుషిత ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత

Food Poison in Nagarkurnool : నాగర్‌కర్నూలు జిల్లా మన్ననూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో 40 మందికి పైగా బాలికలు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. భోజనానంతరం ఒక్కసారిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో.. సిబ్బంది వారిని హుటాహుటిన అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. 10 మందికి ఆక్సిజన్ అమర్చగా.. నలుగురిని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు శ్రీశైలం రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీసిన మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod).. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Food Poison in Mannanur : రాత్రి భోజనానంతరం కొందరు విద్యార్థినులు ఒక్కసారిగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కడుపునొప్పితో బాధపడ్డారు. గమనించిన సిబ్బంది తొలుత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితుల సంఖ్య పెరగడంతో అంబులెన్సు, ప్రత్యేక వాహనాల ద్వారా అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడ్డ 10 మందికి ఆక్సిజన్‌ అమర్చారు. మిగతావారికి సెలైన్ ఎక్కించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని నాగర్​కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులతో ఆసుపత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. డీటీడీఓ కమలాకర్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు.

Mannanur ST Girls Hostel Students Fell Sick : కలుషిత ఆహారం(Contaminated Food) కారణంగానే అస్వస్థతకు గురయ్యామని బాలికలు తెలిపారు. రాత్రి భోజనం కోసం దొండకాయ కూర, సాంబార్ అన్నం పెట్టారని చెప్పారు. ఆహారం సరిగా ఉండదని అన్నంలో పురుగులు వస్తాయని, తాగునీరు సైతం కలుషితంగా ఉంటుందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు.

బాలికల వసతి హాస్టల్​లో కలుషిత ఆహారం కలకలం.. 20 మందికి తీవ్ర అస్వస్థత

Food Poison in Wanaparthy KGBV : కలుషిత ఆహారం తిని.. 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు శ్రీశైలం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కాసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. కాంగ్రెస్‌ నాయకులు, గిరిజన సంఘాల నేతలు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో బాధిత బాలికలను పరామర్శించారు. విద్యార్థుల అస్వస్థతకు కారణం ఏమిటన్నది.. ఆహార నమూనాలను పరీక్షల కోసం పంపిస్తేనే తెలుస్తుందని వైద్యులు తెలిపారు.

ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ కమిషనర్‌, అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి.. వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని ఆదేశించారు. మరోవైపు విషయం తెలిసిన తల్లిదండ్రులు పరుగు పరుగున నాగర్​కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలివచ్చారు. హాస్టల్ సిబ్బంది.. విద్యార్థినుల బాగోగులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Food Poison In Bheemgal Kasturba School : కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత.. 78 మందికి కడుపు నొప్పి, వాంతులు

Snake in Food ECIL Company : ఈసీఐఎల్​ కంపెనీ మధ్యాహ్న భోజనంలో పాము... ఆందోళనలో ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.