నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న ప్రజా ప్రతినిధుల్లో కిష్టారెడ్డి ఒకరని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. బడుగుల అభివృద్ధికి నిత్యం తపించేవారని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలను సంతాపసభలో పాల్గొన్న పలువురు నేతలు కొనియాడారు.
పేదల నాయకుడైన కిష్టారెడ్డి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి పథకాలను తీసుకొచ్చే వారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మల్లురవి, జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, తెరాస రాష్ట్ర నాయకులు గోల్డ్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్