DRI Officers Seize psychotropic substances in Vattem : కొంత మంది వ్యక్తులు వారి తెలివి తేటలు మొత్తం అక్రమంగా ఎలా డబ్బులు సంపాదించాలనే దృష్టితోనే ఉంటారు. కొందరు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు. మరికొందరు వారు సొంతంగానే మొదలుపెడతారు. వారు చేస్తున్న పని తప్పు అని తెలిసిన డబ్బులకు ఆశపడి కొనసాగిస్తుంటారు. ఇలా చేస్తున్న క్రమంలో వారు చేసిన పని పోలీసులకు తెలిసి అరెస్ట్ చేస్తారు. దీనివల్ల వారి జీవితాలు పూర్తిగా నాశనం అయిపోతుంటాయి. అక్రమంగా సంపాదించిన నగదు వల్ల స్వల్పకాలం ఆనందంగా గడిపిన ఎక్కువ కాలం బాధలోనే జీవించాల్సి వస్తుంది.
అదే విధంగా ఓ వ్యక్తి తన తెలివి తేటలను ఉపయోగించి తన గ్రామ చివర పొలంలో కోళ్లఫారం నిర్మించుకున్నాడు. అందులో గత కొద్ది కాలంగా సైకోట్రోపిక్ పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. ఈ విషయం అధికారులకు తెలియడంతో పక్క పథకం ప్రకారం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి.. నిందితుడ్ని దగ్గర ఉన్న సరుకును స్వాధీనం చేసుకున్నారు.
డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. : రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు భారీగా సైకోట్రోపిక్ పదార్థాలను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులోని ఓ కోళ్లఫారంపై డీఆర్‌ఐ అధికారులు దాడులు నిర్వహించారు. మారుమూల ప్రాంతంలోని కోళ్లఫాంలో ఈ సైకోట్రోపిక్ పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో దాడులకు పూనుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
ఈ దాడిలో రూ.3.14 కోట్లు విలువైన 31.42 కిలోల అల్ఫ్రాజోలమ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమంగా సైకోట్రోపిక్ పదార్థం తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు మిషనరీని సీజ్ చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు వివరించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడ్నికి ఎవరైనా సాయం చేస్తున్నారా ? ఏ విధంగా ఇంత విలువైన పదార్థాన్ని మార్కెట్ అమ్ముతున్నాడు? నిందితుడి పూర్తి సమాచారం ఏమిటి? ఇంతక మునుపు ఏమైనా ఇలాంటి కేసులు ఉన్నాయా? పలు కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నాట్టు తెలిపారు.
ఇవీ చదవండి :