రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఘనపురం సమీపంలో ఆంజనేయ తండా వద్ద కల్వర్టు కూలింది. పరిసర గ్రామాలైన దండల్యం తండా, ఆంజనేయ తండా, అక్కారం, బక్కలింగయ్య పల్లిలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పక్కనే దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక గ్రామాల్లో రవాణా పూర్తిగా స్తంభించింది.
ఓ వైపు కూలిన కల్వర్టు... మరోవైపు ఉగ్రరూపం దాల్చిన దుందుభి వాగు వరదలతో స్థానిక ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: భాగ్యనగరంలో కాలనీలు జలమయం... అవస్థల్లో జనం