ETV Bharat / state

జిల్లాలో పాజిటివ్​కేసు నమోదు.. అప్రమత్తమైన హెల్త్​టీంలు

author img

By

Published : Apr 4, 2020, 2:56 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఒక పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల్లో చైతన్యం నింపేలా హెల్త్​టీంలకు అదనపు కలెక్టర్​ మను చౌదరి దిశానిర్దేశం చేశారు.

corona-fever-survey-guidelines-told-by-district-additional-collector-manu-chowdary-to-the-health-teams-at-nagarkarnool
జిల్లాలో పాజిటివ్​కేసు నమోదు.. అప్రమత్తమైన హెల్త్​టీంలు

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి దిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్ధనల్లో పాల్గొన్న నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో జిల్లా కేంద్రంలో ఉన్న 24 హెల్త్ టీంలను అదనపు కలెక్టర్​ మను చౌదరి అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఏ విధంగా చైతన్యపరచాలి, వ్యాధి సోకకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై సూచనలిచ్చారు.

సాధారణంగా వచ్చే దగ్గు, జలుబులకు భయపడవద్దని.. సామాజిక దూరం పాటించాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్​ ప్రజలను కోరారు. ప్రతి హెల్త్ టీంకు ఒక డాక్టర్ ఉంటారని, ప్రజలకు తగు సూచనలు చేస్తారని తెలిపారు. అనంతరం హెల్త్ టీంలకు మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, డాక్టర్ల బృందం పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'జమాత్​' బాస్​పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.