నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం వద్ద మునిగిపోయిన పంపుహౌస్‌ను చూడడానికి వచ్చిన కాంగ్రెస్ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలను పోలీసులు అడ్డుకోవడం వల్ల... ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాము యాదవ్ బృందం బస్టాండ్‌లో బైఠాయించారు. వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
కాంగ్రెస్ పార్టీ బంద్ పిలుపుతో నిరసన చేపట్టిన తమని అరెస్ట్ చేయడం దారుణమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతలా వ్యవహరిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు దగ్గరలో ఉందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత... రేవంత్ రెడ్డికి గాయం