నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎర్రగడ్డ బొల్లారంలో కలెక్టర్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పర్యటించారు.
1981 శ్రీశైలం బ్యాక్ వాటర్ వల్ల తమ గ్రామం పూర్తిగా నీటమునిగిందని.. మొలచింతపల్లి సమీపంలో నాటి ప్రభుత్వం స్థలాలు కేటాయించినట్లు ఎర్రగడ్డ బొల్లారం గ్రామస్థులు తెలిపారు. అప్పటి నుంచి పునరావాసం, పరిహారం విషయంలో న్యాయం జరగలేదన్నారు. 40 ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాల కేటాయించాలని విన్నవించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: 'గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా'