నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన మూడావత్ శంకర్ అనే పేద విద్యార్థికి క్లాస్మేట్ క్లబ్ పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించింది. వారంరోజుల వ్యవధిలో నలుగురు పేద విద్యార్థులకు క్లాస్మేట్ క్లబ్ ఆర్థికసాయం చేసిందని ప్రభుత్వ జీహెచ్ఎంల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు, క్లాస్మేట్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావుల జన్మదినం సందర్భంగా పేద విద్యార్థులకు సాయం చేస్తున్నట్టు తెలిపారు. క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వెంకటరాజు, పరమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్