నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెరాసలో చేరాలన్నది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, కొంతమంది పెద్దలు తనను అడుగుతున్నారని తెలిపారు. సొంతంగా నిర్ణయం తీసుకోనని, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మాట్లాడతానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానన్నారు.
ఇవీ చూడండి:కాంగ్రెస్‌కి మరో షాక్...కారెక్కుతున్న సుధీర్‌రెడ్డి