నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెనిమిళ్ల పెద్ద నర్సింహ అనే వృద్ధుడిని అచ్చంపేటలోని వ్యవసాయం క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా నరికి చంపేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ నర్సింహులు తెలిపారు.
ఇవీ చూడండి: పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!