ETV Bharat / state

'కనిపించకుండా పోయిన అమ్మాయి శవమై తేలింది' - kollapur news

అమ్మాయి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. అంతలోనే నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ శివారులో శవమై తేలింది.

A girl died in a well in kollapur
'కనిపించకుండా పోయిన అమ్మాయి శవమై తేలింది'
author img

By

Published : Jun 28, 2020, 4:15 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో కనిపించకుండా పోయిన ఓ అమ్మాయి... పట్టణ శివారులోని వ్యవసాయ బావిలో శవమై తేలింది. ఆ అమ్మాయి శనివారం ఇంట్లో నుంచి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.

ఈరోజు ఉదయం కొల్లాపూర్ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... అమ్మాయిని ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. బావి పక్కనే మద్యం బాటిల్ కనపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవీ చూడండి: ఆసుపత్రి 'చిల్లర' నిర్వాకం.. వృద్ధ దంపతుల బందీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.