ETV Bharat / state

Tiger Wandering: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం.. - తెలంగాణ జిల్లాలో పెద్దపులి సంచారం

Tiger Wandering At mulugu: ములుగు జిల్లాలో రాయినిగూడెం శివార్లలోని దేవుని గుట్ట అటవీ ప్రాంతంలో పులి అడుగులను స్థానికులు గుర్తించారు. అడుగుజాడల ద్వారా నిర్ధారించిన అటవీశాఖ అధికారులు.. సమీప ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.

Tiger Wandering at mulugu
Tiger Wandering
author img

By

Published : Dec 1, 2021, 1:19 PM IST

Tiger At Mulugu: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రాయినిగూడెం శివార్లలోని దేవుని గుట్ట అటవీ ప్రాంతంలో పులి అడుగులను స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అడుగుజాడలు పరిశీలించిన అధికారులు...పులి తిరుగుతుందని నిర్ధారించారు. దేవుని గుట్ట నుంచి లక్నవరం, తొండపాడు పొలాల మీదుగా పులి వెళ్లినట్లు తేల్చారు. సమీప గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు.

Tiger Roaming at Bhadradri: నవంబర్​ మూడోవారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ అధికారులను, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందు మండలాల ప్రజలను పులి భయభ్రాంతులకు గురిచేసింది. పాల్వంచ నుంచి టేకులపల్లి మండలంలోకి ప్రవేశించిన పులి.. అనంతరం ఇల్లందు మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో తన కదలికలను చూపించింది. రెండుసార్లు టేకులపల్లి మండలంలో ప్రత్యక్షంగా కనిపించిన పులి .. ఎక్కడ ఉందో తెలియక అటవీశాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. స్వయంగా డీఎఫ్ఓ రంజిత్ నాయక్.. అటవీ శాఖ అధికారులు సిబ్బందితో కలిపి గాలింపు చేపట్టినా పులి ఏ దిశగా వెళుతోందో గుర్తించలేకపోయారు. పూర్తిస్థాయిలో కెమెరాలు లేకపోవడం వల్ల పులి కదలికలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది.

tiger in Nallamala forest: నవంబర్​ నెలలో.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వటవర్లపల్లి సమీపంలోని రాసమొల్ల బావి బేస్ క్యాంపు దగ్గర పెద్ద పులి సంచారాన్ని కొందరు గుర్తించారు. అటు వైపు వెళ్లిన పశువుల కాపరులకు కనబడటంతో తమ చరవాణిలో ఫొటోలు చిత్రీకరించారు.

ఇదీచూడండి: Hunters Killing Tigers: పులిని చంపిన వేటగాళ్లు.. చర్మాన్ని తరలిస్తుండగా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.