ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతర వచ్చే నెల 5 నుంచి 8 తేదీ వరకు జరగనుంది. ఈ జాతరకు భారీగా భక్తులు రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సోలార్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. మేడారం జాతరలో భాగంగా 20 కిలోమీటర్ల మేర సోలార్ విద్యుద్దీపాలను బిగించాలని ఆదేశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
అందుకే పస్రా మీదుగా మేడారం వరకు, తాడ్వాయి నుంచి మేడారం వరకు, మేడారం చుట్టూ ఉన్న గ్రామాలు ప్రాజెక్ట్ నగర్, వెంగలపూర్, నార్లపూర్, కొత్తూరు, ఊరట్టం గ్రామంలో గ్రామాల్లో విద్యుత్ దీపాల అలంకరణతో సుందరీకరిస్తున్నారు. జాతర మొత్తంలో 229 సోలార్ విద్యుత్ దీపాలు బిగిస్తున్నామని, కొన్ని చోట్ల సోలార్ దీపాలు ఇప్పటికే రాత్రివేళలో కాంతులు వెదజల్లుతున్నయాని అధికారులు అంటున్నారు.
ఇవీ చూడండి: ట్రా'ఫికర్': పంతంగిలో కిలోమీటరు మేర స్తంభించిన వాహనాలు