ETV Bharat / state

వెంకటాపూర్​లో ఓపెన్​కాస్ట్​కు సన్నాహాలు... ఆందోళనలో రైతులు - వెంకటాపూర్​లో ఓపెన్​కాస్ట్​ పనులు ప్రారంభం

ములుగు జిల్లా వెంకటాపూర్ శివారులోని పీవీ నరసింహారావు ఉపరితల గనిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఆరు నెలలుగా బొగ్గు నిక్షేపాల పరిశీలన కోసం అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. అనుమతులు పూర్తిస్థాయిలో రాగానే తవ్వకాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

వెంకటాపూర్​లో ఓపెన్​కాస్ట్​కు సన్నాహాలు... ఆందోళనలో రైతులు

author img

By

Published : Dec 13, 2020, 2:07 PM IST

ములుగు జిల్లా వెంకటాపూర్ మండల సమీపంలో బొగ్గు ఓపెన్ కాస్ట్ త్వరలో ప్రారంభం కానుంది. రైతులు, రెవెన్యూ, ప్రజాప్రతినిధులతో సింగరేణి సంస్థ సమావేశాన్ని నిర్వహించింది. భవిష్యత్తులో చేపట్టబోయే పనులు, స్థానికులు కలిగే ఇబ్బందులపై చర్చించారు. సింగరేణి భూనిర్వాసిత పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టడం వల్ల సర్వే మొదలుకాలేదు. ఇంతలోనే సంస్థ కోరినట్లు వెంకటాపూర్ శివారులోని ప్రభుత్వ భూములను 20 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం వెంకటాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిని సింగరేణి సంస్థకు లీజుకు ఇవ్వడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ అనుమతి లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగులో ఉన్న ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించే వరకూ పోరాటం చేస్తామంటున్నారు. ఓపెన్ కాస్ట్ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని వాపోతున్నారు. మైనింగ్ ప్రారంభమయ్యే ముందు భూములు కోల్పోయిన రైతులందరికీ ఎకరాకు రూ.30 నుంచి 35 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అసైన్ మెంట్, లావన్ పట్టా, పట్టా కలిగిన భూమి 1500 ఎకరాలు, వేయి ఎకరాల అటవీ భూమి... మొత్తంగా 2,500 ఎకరాల్లో సింగరేణి బొగ్గు తీయనుంది. ఇప్పటికే సింగరేణి సంస్థ... సాగు భూముల్లో జెండాలు పాటింది. వెంకటాపూర్ శివారు అరకిలో మీటర్ దూరంలో ఓపెన్ కాస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రైతులకు మద్దతుగా ఆందోళనలు చేస్తాం : చాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.