ETV Bharat / state

Ramappa Temple: యునెస్కో గుర్తించినా... పట్టాలెక్కని అభివృద్ధి పనులు - ములుగు జిల్లా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో గుర్తింపు దక్కించుకున్న ఏకైక కట్టడం రామప్ప ఆలయం. కాకతీయుల కళా వైభవానికి అరుదైన గుర్తింపు దక్కడంతో ప్రపంచమే ఓసారి రామప్ప వైపు చూసింది. దేశమంతా హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొంది ఇప్పటికే మూడు నెలలు దాటింది. గుర్తింపు ఇచ్చే సమయంలో యునెస్కో కొన్ని షరతులు విధించింది. దాని ప్రకారం ఆలయంలో ఏ పనులు జరగట్లేదు. ఇప్పటికైనా యునెస్కో సూచించిన అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Ramappa Temple
రామప్ప ఆలయం
author img

By

Published : Nov 11, 2021, 12:34 PM IST

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కి మూడు నెలలు గడుస్తున్నా అభివృద్ధి దిశగా అడుగులు పడడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు దక్కించుకున్న ఏకైక కట్టడమిది. ఈ ఆలయానికి గుర్తింపు ఇచ్చే సమయంలో యునెస్కో కొన్ని షరతులు విధించింది. వాటి ప్రకారం ఉపాలయాల పునర్నిర్మాణం, పునరుద్ధరణ, పరిసర ప్రాంతాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు తదితర పనులను 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు యునెస్కో గుర్తింపు దక్కినప్పటి నుంచి భక్తులు, పర్యాటకుల రద్దీ పెరిగింది. గడిచిన మూడు నెలల్లో 3 లక్షల మందికిపైగా సందర్శించినట్లు అంచనా. పర్యాటకుల కోసం కాటేజీలు, హోటళ్లు, రామప్పలో పార్కింగ్‌ స్థలం తదితర ఏర్పాట్లూ ముందుకు సాగడం లేదు.

పునరుద్ధరణకు నోచుకోని కామేశ్వరాలయం

యునెస్కో షరతుల్లో ప్రధానమైనది కామేశ్వర ఆలయ పునర్నిర్మాణం. ఉమ్మడి రాష్ట్రంలో 2009లోనే దీని పునరుద్ధరణకు శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పూర్తిగా తొలగించారు. దాదాపు 12 ఏళ్లవుతున్నా పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉంది. టెండరు ప్రక్రియ కూడా చేపట్టలేదు. రామప్ప చుట్టూ, పరిసరాల్లో 16 ఉపాలయాలున్నాయి. ఆలయ సమీపంలోని శివాలయం, గొల్లాల గుడిని పునరుద్ధరించాల్సి ఉంది. ఇటీవల రామప్ప సరస్సు కట్టపై ఉన్న శివాలయం, త్రికూటాలయాలనూ పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఆ పనులూ పట్టాలెక్కలేదు. పురాతన ఆలయాల పునర్నిర్మాణం, పునరుద్ధరణ పనులను నిపుణులు, స్తపతుల ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉండగా.. వారిని ఇంతవరకు గుర్తించలేదు.

ఏర్పాటు కాని అభివృద్ధి కమిటీలు

రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో కేంద్ర, రాష్ట్ర పురావస్తుశాఖ, ఇరిగేషన్‌, టూరిజం, రెవెన్యూ తదితర శాఖలతో కమిటీ, పాలంపేట అభివృద్ధి ప్రాధికార కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షలతో పాటు అభివృద్ధి పనులకు నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు సైతం సూచించినా ఇప్పటివరకు ఆ దిశగా కదలిక లేదు. మరోవైపు ఆలయం, పరిసరాల అభివృద్ధికి చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియకు అడుగులు పడటం లేదు. ఆలయ పరిధిలో చేపట్టాల్సిన పనులు కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్నాయని ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు. పనులు టెండర్ల దశలో ఉన్నాయన్నారు. యునెస్కో విధించిన గడువులోగా పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రామప్ప ఆలయ పరిసరాలు తదితర అభివృద్ధికి భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సర్వే కూడా నిర్వహించారు. కానీ భూసేకరణ ప్రక్రియ మాత్రం ఇప్పటికీ జరగలేదు.

యునెస్కో గుర్తింపు లభించినా.. ఇప్పటికీ ఏ అభివృద్ధి జరగట్లేదు. పండుగల సమయంలో అలంకరణలు చేస్తున్నారు.. కానీ అవి నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం వసతులు కూడా సరిగా ఉండట్లేదు. వారసత్వ సంపదను కాపాడుకోవడం కోసం ప్రభుత్వం కృషి చేయాలి. యునెస్కో గుర్తింపు వచ్చిందనే సంతోషం తప్పా... పనులేమి జరగట్లేదు. అన్ని పేపర్లకే పరిమతవుతున్నాయి.

-స్థానికులు

యునెస్కో గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. యునెస్కో విధించిన గడువు షరతులను నెరవేర్చాలని కూడా సూచించింది. రామప్పకు సంబంధించిన ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తామని అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పలు సూచనలు చేసింది.

గత నెలలో రామప్పను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్​లు సందర్శించారు. కానీ అభివృద్ధి నిధుల విషయంపై ఏ ప్రకటనలు చేయలేదు. అభివృద్ధికి సహకరిస్తామని మాత్రమే చెప్పారు. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుర్తింపు పొందిన సమయంలో యునెస్కో రామప్ప ఆలయ అభివృద్ధి చేపట్టాలని సూచించింది. పనుల పూర్తికి 2022 డిసెంబర్ వరకు గడువు ఇచ్చింది కానీ... ఇప్పటికీ ఉపాలయాల పునర్నిర్మాణం, పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన పనులు ముందడుగు వేయలేదు. ఆలయ పరిధిలో చేపట్టాల్సిన పనులు కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంటుందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చెప్పారు. పనులు చేపట్టేందుకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, పనులు టెండర్ల దశలో ఉన్నాయని వెల్లడించారు. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Ramappa temple : రామప్పకు వెళ్తే ఈ పర్యటక ప్రాంతాలూ చూసేయండి మరి!

RAMAPPA: గుర్తింపు దక్కింది సరే.. సంరక్షణ మాటేంటి?

Ramappa: వారసత్వ హోదా తర్వాత ఆలయ అభివృద్ధికి మొదటి అడుగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.