ములుగు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లుకు ములుగు జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సేవలందిస్తోన్న నారాయణరెడ్డి... 2019 మార్చి 4న ములుగు జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
ములుగు జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో అనేక మంచి పనులతో ముందుకు సాగుతూ తనదైన ముద్ర వేసుకున్న నారాయణరెడ్డిని ఏడాది తిరక్కుండానే బదిలీ చేయటంలో ఆంతర్యమేంటని స్థానికుల్లో సందేహాలు మొదలయ్యాయి. మేడారం జాతరను మునుపెన్నడూ లేని విధంగా జరిపించాలన్న కార్యదీక్షతో పనిచేస్తోన్న కలెక్టర్‌ను ఇలా బదిలీ చేయటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్‌లో జనవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు ఉండటం, దీర్ఘకాలంగా కొనసాగుతోన్న పసుపు రైతుల సమస్యల దృష్ట్యా... నారాయణ రెడ్డిని నియమించినట్లు సమాచారం.