గోదావరి నీళ్లివ్వకుండా ములుగును ఎడారిగా మార్చే కుట్రను ప్రభుత్వం మానుకోవాలని ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోదావరి ముళ్ల కట్ట బ్రిడ్జి వద్ద తలపెట్టిన జలదీక్షను పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. ఈ చర్యతో ఎమ్మెల్యే సీతక్క... కాంగ్రెస్ నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు.
ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతమైనా... ఇక్కడి ప్రాంతాలకు నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తలాపున గోదావరి ఉన్న 9 మండలాకు నీళ్లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కళ్ళుతెరచి ములుగు నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు దేవాదుల పైపులైను ద్వారా నీరు అందించాలని సీతక్క కోరారు.