Mirchi farmers Problems: రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు తామర పురుగుతో బెంబేలెత్తుతున్నారు. ఎన్ని మందులు కొట్టినా పంట దిగుబడి రాకపోవడంతో... పలు చోట్ల చేలను వదిలేస్తున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయ పంటలను వేస్తున్నారు. ములుగు జిల్లాలో మిర్చి రైతులు మాత్రం... పూర్తి స్థాయిలో నష్టపోకుండా ఉండేందుకు... పచ్చి మిర్చిని కోసి... ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కొంతలో కొంత ఖర్చులు మిగులుతాయని రైతులు భావిస్తున్నారు. ఇలా జిల్లాలోని పలు మండలాల నుంచి సుమారు 1000 క్వింటాళ్ల పచ్చి మిర్చిని... రైతులు మార్కెట్లకు తరలిస్తున్నారు.
పచ్చి మిర్చికి పొరుగు రాష్ట్రాలో గిరాకీ ఉండటంతో.. పురుగు సోకని పంటను కూలీలతో కోపిస్తున్నారు రైతులు. ఎన్ని మందలు చల్లినా పంట దిగుబడిలో మార్పు రాకపోవడంతోనే... పచ్చి మిర్చిని కోసి... అప్పులు తీర్చుకుంటున్నామని అన్నదాతలు చెబుతున్నారు. డిసెంబర్ నెలలో కిలోకి 55 రూపాయల నుంచి 60 వరకు ధర పలికిన పచ్చిమిర్చి.. జనవరిలో 45 రూపాయల నుంచి 50 పలుకుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తామర పురుగు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి... తమను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: