ములుగు జిల్లా మేడారం జాతర పనులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. ఇప్పటికే 99 శాతం పనులు పూర్తయ్యాయని.. మిగిలినవి కూడా ఈనెల 30లోపు పూర్తి కానున్నాయన్నారు. ఈ సారి మేడారం జారతలో భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ నీటిని వినియోగించనున్నామని మంత్రి పేర్కొన్నారు.
మేడారం జాతరకు చేరుకునే జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలని.. ఇప్పటికే సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారని మంత్రి తెలిపారు. మేడారం జాతర ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఇప్పటికే సీఎం సమీక్షించారన్నారు. మేడారం జాతర జరిగే ప్రాంతం అటవీ ప్రాంతం అయినందున పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఆలోచనను ఈసీ అమలు చేసింది'