ETV Bharat / state

ఏరియా ఆసుపత్రిలో కొవిడ్ సహాయ కేంద్రం ప్రారంభం

author img

By

Published : May 10, 2021, 7:45 PM IST

ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి సంయుక్తంగా కొవిడ్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Help Center for corona victims, mulugu Area Hospital

ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి సంయుక్తంగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రికి వచ్చే ప్రజల సహాయార్థం ప్రతిరోజు 24 గంటల పాటు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తారు.

వారు ప్రతిరోజు వైద్య సిబ్బంది సలహాలు తీసుకుని వాటిని కరోనా వ్యాధిగ్రస్థులకు తెలియజేస్తారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్, కొవిడ్ వార్డుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆసుపత్రికి వచ్చే ప్రజలకు సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్​వో ఎ.అప్పయ్య, సీఐ జి.శ్రీధర్, ఎస్ఐ బి.ఓంకార్ యాదవ్, ఫణి, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 4,826 కరోనా కేసులు.. 32 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.