ములుగు జిల్లాలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వెంకటాపూర్, గోవిందరావుపేట, ములుగు మండలాల్లో కురిసిన అకాల వర్షంతో ములుగు పట్టణంలో అక్కడక్కడ రహదారులు జలమయమయ్యాయి.
జంగాలపల్లి, వెంకటాపూర్, నర్సాపూర్, గోవిందరావుపేట గ్రామాల్లో ఆరబోసిన వరిధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటిపాలవ్వడం వల్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి ఏపీలో తాజాగా 20,345 కేసులు... 108 మంది మృతి