ETV Bharat / state

రెడ్​జోన్​ నుంచి గ్రీన్​జోన్​గా ములుగు: కలెక్టర్​ కృష్ణ ఆదిత్య

రెడ్​జోన్ ​నుంచి ములుగు జిల్లా గ్రీన్​జోన్​గా మార్పుచెందిందని జిల్లా కలెక్టర్​ ఎస్​ కృష్ణ ఆదిత్య తెలిపారు. జిల్లాలో ప్రజలెవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. మరికొన్ని రోజులు లాక్​డౌన్​ను ఇలాగే ప్రజలందరూ పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

Collector Krishna Aditya said Muluga has become a green zone from the Red Zone
రెడ్​జోన్​ నుంచి గ్రీన్​జోన్​గా ములుగు..
author img

By

Published : Apr 24, 2020, 7:48 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్​జోన్లుగా ప్రకటించాయి. అయితే ములుగు జిల్లాలో మర్కజ్ ​నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ కావడం వల్ల వారిని గాంధీ ఆసుపత్రిలో చేరి ఇటీవల నెగిటివ్​ అని రిపోర్ట్​తో ఇళ్లకు వచ్చారు. రెడ్​జోన్​గా ఉన్న ములుగును గ్రీన్​జోన్​గా మార్చారని కలెక్టర్​ ఎస్​ కృష్ణ ఆదిత్య తెలిపారు.

జిల్లాలోని ప్రజలు, రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా భౌతిక దూరం పాటిస్తూ స్వీయ నిర్బంధమై కరోనాను జిల్లాలోకి ప్రవేశించకుండా చూడాలని ఆయన సూచించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకై జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాలను ఏర్పాటు చేశామని వారెవరూ ఆందోళన చెందొద్దని కలెక్టర్​ భరోసా కల్పించారు. ఉపాధి హామీ పనులు కూడా ప్రారంభమయ్యాయని మొత్తంగా 17 వేల మంది ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. రంజాన్​ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లింలు ఎవరి ఇంట్లో వారు ప్రార్థనలు చేసుకోవాలని.. ఎవరూ గుమిగూడి నమాజ్​లు నిర్వహించకూడదని.. లాక్​డౌన్​ను తూచా తప్పకుండా పాటించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

ఇవీచూడండి: ఉరితో ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చీర ఉయ్యాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.