మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పురపాలక సంఘం పరిధిలోని కొండాపూర్‌కు చెందిన గృహిణిని పోచంపల్లికి చెందిన నోముల భరత్ కుమార్ అనే యువకుడు ఏప్రిల్‌లో ఓ పరీక్షా కేంద్రం వద్ద పరిచయం చేసుకున్నాడు. తాను ఎమ్మెల్సీ కొడుకునని చెప్పి పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం పెరిగి.. ఇద్దరి మధ్య చనువుకు దారి తీసింది.
ఆ చనువులో ఇద్దరూ కలిసి తిరిగారు. భరత్ ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఇదే అదునుగా భావించిన భరత్ ఆమె దగ్గర డబ్బులు గుంజుదామని చూశాడు. లేదంటే.. ఇద్దరూ చనువుగా ఉన్న వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడు. భయపడ్డ ఆమె ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి భరత్‌ను అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు సీఐ రఘువీర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు