హైదరాబాద్ కూకట్‌పల్లి అల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న స్రవంతి సేంద్రీయ సాగు చేస్తున్నారు. ఇంటిపై 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ అందమైన వనం సృష్టించారు. ఇక్కడ గులాబీ, చామంతి, మందారం పూలతోపాటు.. టమాట, వంకాయ, చిక్కుడు లాంటి కాయగూరలు కనిపిస్తాయి. జామ, సీతాఫలం, బొప్పాయే కాకుండా.. డ్రాగన్‌ఫ్రూట్, జబూటీ కవా లాంటి కొత్తకొత్త పండ్లు దర్శనమిస్తాయి. యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఆవాలు, మిరియాల మొక్కల సువాసనలు మైమరపిస్తాయి.
ఇంట్లోకి తెచ్చుకున్న కూరగాయలు, పండ్ల నుంచి విత్తనాలు తీసి పెంచుకోవచ్చని స్రవంతి చెబుతున్నారు. మెుక్కలను చీడపీడల నుంచి రక్షించేందుకు నివారణ మందులు ఇంట్లోనే తయారుచేస్తున్నట్లు వివరించింది.
మిద్దెసాగు ప్రత్యేక ఏర్పాట్లు...
మిద్దెసాగు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్రవంతి కుటుంబసభ్యులు తెలిపారు. మెుదట్నుంచీ తమకు ఇంట్లో మెుక్కలు పెంచేవాళ్లమని.. కుండీల్లో సేంద్రీయ విధానంలో పండిస్తున్నట్లు పేర్కొన్నారు.
మిద్దెసాగు, మొక్కల సంరక్షణ, సేంద్రీయ ఎరువులు, విత్తనాల తయారీ, నీటి నిర్వహణ, వంటింటి చిట్కాలతో కూడిన అనుభవాలతో యూట్యూబ్ ఛానల్‌లో వివరిస్తున్నట్లు స్రవంతి చెబుతున్నారు.
- ఇదీ చూడండి : నేటి నుంచి వృద్ధులకు కొవిడ్ వ్యాక్సిన్