ETV Bharat / state

తెలంగాణలో తొలి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్

తెలంగాణలోనే మొదటి ఫౌల్ట్రీ ఎరువుతో పనిచేసే బయోగ్యాస్ ప్రాజెక్టును స్థాపించినట్లు శ్రీనివాస్ హ్యాచరీస్‌కు చెందిన సోలికా ఎనర్జీ ప్రకటించింది. బాలానగర్ సమీపంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ కేంద్రానికి రోజుకు 2.4 టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.

The first poultry manure biogas project in Telangana
తెలంగాణలో తొలి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్
author img

By

Published : Jan 8, 2021, 11:51 AM IST

తెలంగాణలోనే మొదటి ఫౌల్ట్రీ ఎరువుతో పనిచేసే బయోగ్యాస్ ప్రాజెక్టును స్థాపించినట్లు శ్రీనివాస్ హ్యాచరీస్‌కు చెందిన సోలికా ఎనర్జీ ప్రకటించింది. మేడ్చల్‌ జిల్లాలోని బాలానగర్ సమీపంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ కేంద్రానికి రోజుకు 2.4 టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.

'సస్టేనబుల్ ఆల్టర్నేటీవ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్​పోర్టేషన్' పథకంలో భాగంగా దీనిని నిర్మించామని సోలికా ఎనర్జీ పేర్కొంది. అత్తాపూర్ ఇండియాన్ ఆయిల్ అవుట్​లెట్‌కు దీన్ని విక్రయించనున్నట్లు పేర్కొంది. తెలంగాణలో మరో సీబీజీ ప్రాజెక్టును నెలకొల్పనున్నామని... దీనికి 3 టన్నుల సామర్థ్యం ఉంటుందని సోలికా ఎనర్జీ వెల్లడించింది.

ఇదీ చదవండి: కోడి పందాలు జరగకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.