రాజీవ్ స్వగృహ ఇళ్లు 2012లోనే పూర్తి కావాల్సి ఉండగా... వాటిని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వెంటనే వాటి నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. పట్నంగోసలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ ఇళ్లను మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. రూ.5 వేలు కట్టి పేర్లు నమోదు చేసుకున్న లబ్దిదారులు 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా... ఇప్పటి వరకు ఇళ్ల కేటాయింపులు జరగలేదన్నారు.
పనిచేయకపోతే ఉద్యోగాలు తీసేస్తామంటున్న కేసీఆర్, కేటీఆర్‌లు ముందు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను అవసరమైతే పాత్రికేయులకైనా కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా దేవేందర్‌నగర్, కైసర్‌నగర్, డి.పోచంపల్లిలోని రెండు పడక గదుల ఇళ్లను సందర్శించారు. పనులు ఎందుకు జరగడం లేదని అధికారులను చరవాణిలో అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ల బిల్లులను ఆపాలని, పెనాల్టీలను వసూలు చేయాలని చెప్పారు.
ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'