Etela Rajender house arrest: పోలీసులు అధికారపక్షానికి కొమ్ము కాస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. బండి సంజయ్‌కు మద్దతుగా కరీంనగర్ వెళ్లకుండా.... హైదరాబాద్ శామీర్‌పేటలోని ఈటల నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయనను గృహనిర్బంధం చేశారు. తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని ఈటల ఆరోపించారు. కొద్ది రోజులుగా టీచర్లు, ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతుంటే.... ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులుగా కనీసం వారికి మద్దతుగా నిలిచే అవకాశం కూడా కల్పించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నల్గొండలో వేల మందితో సభ నిర్వహిస్తే కొవిడ్ వ్యాప్తి చెందదా అని ప్రశ్నించారు. వారి పక్షాన బండి సంజయ్ దీక్ష చేస్తుంటే.. అరెస్ట్ చేయడం హేయమైన చర్యని అన్నారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన తీరు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
టీచర్లు, ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతుంటే.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. వాళ్ల పక్షాన దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడమనేది ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం ఆరిపోయే దీపం. పోలీసులు అధికార పక్షం కొమ్ము కాస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. -ఈటల రాజేందర్, భాజపా నేత
ఇదీ చదవండి: