ETV Bharat / state

JNTUH Golden Jubilee Celebrations: దేశంలో తొలి టెక్నాలాజీకల్ వర్సిటీ జేఎన్​టీయూహెచ్​: గవర్నర్

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని గవర్నర్​​ తమిళిసై సౌందరరాజన్​(Governor Tamilisai Soundararajan) సూచించారు. జేఎన్​టీయూ(JNTU) హైదరాబాద్​ స్వర్ణోత్సవాలను (JNTUH Golden Jubilee Celebrations) ఆమె ప్రారంభించారు. వర్సిటీలో పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు.

JNTUH GOLDEN JUBILEE CELEBRATIONS
GOVERNOR TAMILA SAI
author img

By

Published : Oct 3, 2021, 12:46 PM IST

జేఎన్టీయూకు(JNTUH Golden Jubilee Celebrations) దేశంలోనే మంచి పేరుందని గవర్నర్ తమిళిసై(Governor Tamilisai Soundararajan) ప్రశంసించారు. దేశంలోనే మొదటి టెక్నలాజికల్​ యూనివర్సిటీ జేఎన్​టీయూహెచ్​ అని గవర్నర్​ తెలిపారు. జేఎన్​టీయూ(JNTU) హైదరాబాద్​ స్వర్ణోత్సవాలను (JNTUH Golden Jubilee Celebrations) గవర్నర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కటీ సాంకేతికపైనే ఆధారపడి ఉందని.. అందుకు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత్​ నుంచి ఇతర దేశాలకు టీకాలు ఎగుమతి అవుతున్నాయంటే.. ఇలాంటి యూనివర్సిటీల నుంచి వెళ్లిన విద్యార్థుల కృషేనని గవర్నర్(Governor Tamilisai Soundararajan)​ కితాబిచ్చారు. ఈ యూనివర్సిటి పరిధిలో ఇప్పటి వరకూ 19 లక్షల మంది చదువుకున్నారన్న గవర్నర్.. పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులు అంటే భావితరాల ఆస్తని.. వారిందరినీ ఏకం చేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చన్నారు.

అన్ని సౌకర్యాలు ఉన్నాయ్​..

జేఎన్​టీయూ హైదరాబాద్​ స్వర్ణోత్సవ వేడుకలు గవర్నర్​ చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉందని వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. దేశంలోనే జేఎన్​టీయూహెచ్​కు మంచి పేరుందన్న వీసీ.. అనుభవిజ్ఞులైన అధ్యాపకుల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు వర్సిటీలో ఉన్నాయని వీసీ తెలిపారు. ఏడాది పాటు స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ 50 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు, ప్రత్యేకతలను ఈ యూనివర్సిటీ సాధించిందని వీసీ గుర్తుచేశారు.

ఇదీచూడండి: JNTUH Golden Jubilee: ఆ బాస్​లు అందరూ.. ఒకప్పుడు జేఎన్‌టీయూ విద్యార్థులేనని మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.