ETV Bharat / state

vaccination: దిల్లీ పబ్లిక్ స్కూల్​లో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ - తెలంగాణ వార్తలు

నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్​లో ప్రత్యేక టీకా కార్యక్రమం చేపట్టారు. రెయిన్​బో ఆస్పత్రి సహకారంతో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఉచితంగా టీకాలు వేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం సూచించిన ధరకు వ్యాక్సిన్ ఇచ్చారు.

vaccination, delhi public school
వ్యాక్సినేషన్, దిల్లీ పబ్లిక్ స్కూల్
author img

By

Published : Jun 20, 2021, 12:05 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్​లో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. రెయిన్​బో ఆస్పత్రి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కలిపి మొత్తం 1200 మందికి ఉచితంగా టీకా ఇచ్చారు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ ధరను తీసుకుని విద్యార్థుల తలిదండ్రులకు టీకా వేస్తున్నట్లు డీపీఎస్ డైరెక్టర్ యశస్వి తెలిపారు.

ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కరోనా నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్​ అవసరమా ?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.