ETV Bharat / state

ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలి: మాల మహానాడు - SC classification bill should be withdrawn: Mala Mahanadu

కూకట్​పల్లి వై జంక్షన్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

SC classification bill should be withdrawn: Mala Mahanadu
ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలి: మాల మహానాడు
author img

By

Published : Sep 1, 2020, 12:30 PM IST

ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, వర్గీకరణ పేరుతో షెడ్యూల్ కులాల సముదాయాన్ని చిన్నాభిన్నం చేయొద్దని మాల మహానాడు డిమాండ్​ చేసింది. ఈ మేరకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో కూకట్​పల్లి వై జంక్షన్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేశారు.

పాలకులకు విభజించి పాలించే అవకాశాలు ఇవ్వకూడదని రాజ్యాంగంలో పొందుపరిచిన 341, 342 ఆర్టికల్ జోలికి పోవొద్దని చెన్నయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునః సమీక్ష జోలికి పోవొద్దని హెచ్చరించారు.

ఇదీచూడండి.. 'వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.