మేడ్చల్ జిల్లా సురారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలతో కిటకిటలాడుతుంది. కొవిడ్ పరీక్షలు చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆరోగ్య కేంద్రానికి తరలివచ్చారు. ఇప్పటికే వంద టోకెన్లు ఇచ్చినప్పటికీ... మరో వందమందికి పైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు.
వైద్యులు మాత్రం కొవిడ్ లక్షణాలు ఉన్నవారు మాత్రమే రావాలని సూచిస్తున్నప్పటికీ... లక్షణాలు లేని వారు కూడా పరీక్షలు చేయించుకోవడానికి వచ్చారు. దీనివల్ల ఆరోగ్య కేంద్రం రద్దీగా మారింది. కుత్బుల్లాపూర్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున బల్దియా అధికారులు ప్రియాంకను నోడల్ అధికారిగా నియమించారు.