ప్రతీ ఒక్క యువకుడు తన ఓటే కాకుండా తన కుటుంబం, తన బంధువులతో కూడా ఓట్లు వేయించి తనను గెలిపించారని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. "2014లో తెలంగాణ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను ప్రధాని మోదీ ఐదేళ్లు పూర్తవుతున్నా నెరవేర్చలేరని మండిపడ్డారు. వీటిని ఇంకెప్పుడు నెరవేరుస్తారంటూ.. ఇదే తన మొదటి ప్రశ్న అని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన జాతీయ ప్రాజెక్టులు, ట్రైబల్ యూనివర్సిటీ, ఏయిమ్స్, ఖమ్మంలో ఉక్కుపరిశ్రమ వచ్చే వరకు తన పోరాటం ఆపనని రేవంత్ తెలిపారు.
ఇవీ చూడండి: గతం కన్నా ఘనంగా కమల వికాసం