మేడ్చల్ జిల్లా నిజాంపేట్ కార్పొరేషన్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 33 వార్డుల్లో 134 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
ఓటర్లు ఇప్పుడిప్పుడే ఓటు వేసేందుకు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: తెదేపా బ్రహ్మాస్త్రం: ఇంతకీ రూల్ 71 ఏంటీ?