కాలుష్య నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో మొదటిసారిగా 'ప్లాస్మికోర్' అధునాతన యంత్రాన్ని మేడ్చల్ జిల్లా కొంపల్లి పురపాలక పరిధిలో ప్రారంభించారు. దూలపల్లిలో ఏజిస్ గ్రూప్ సహకారంతో రూ. 31 లక్షలతో అధునాతన ప్లాస్మాకోర్ పరికరాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కొంపల్లి మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను కరిగించే 'ప్లాస్మికోర్' వరల్డ్ క్లాస్ సెల్ఫ్ డిసింటిగ్రేషన్ మెషిన్ ను దూలపల్లి డంపింగ్ యార్డ్ వద్ద ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు.
జీరో వేస్ట్, కాలుష్య నివారణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థ పదార్థాలను కరిగించి దాని ద్వారా వచ్చే పొడితో సిమెంట్, ఇటుకలు, టైల్స్ వంటి తయారీకి ఉపయోగించే విధంగా అధునాతన పరికరాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థానిక అధికారులు, ఏజిస్ గ్రూప్ సమష్టి కృషితో ఈ కార్యక్రమానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి యంత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వినియోగించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు.
ఇదీ చూడండి: పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుంది: భాస్కరరావు