మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల సమీపంలో ఓ గృహ సముదాయంలోని ఫ్లాట్లో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సీలింగ్, ఫర్నీచర్ మంటలకు ఆహూతయ్యాయి. అపార్ట్ మెంట్ వాసులు అగ్ని మాపక సిబ్బందికి, పోలీస్ స్టేషన్కు సమాచారం తెలియజేశారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వర్షాకాలం కావడం వల్ల మంటలు ప్రక్కన గదులకు చేరుకేలేదు. పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : నవంబర్ వరకు నీటిని విడుదల చేయండి: తెలుగు రాష్ట్రాలు