ETV Bharat / state

Mynampally MLA Ticket Issue : మైనంపల్లిని మార్చాలని BRS నిర్ణయం..! - BRS To Drop Rebel Mynampally

Mynampally MLA Ticket Issue : మల్కాజిగిరిలో తనకు మెదక్‌ని తన కుమారుడికి కేటాయించాలనడం సహా మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్ఠానం ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరనేది అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం. మైనంపల్లితో కాంగ్రెస్‌ నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

MLA Mynampally on MLA Tickets 2023
T Congress Leaders Consultation With Mynampally
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 7:59 AM IST

Mynampally MLA Ticket Issue మైనంపల్లిని మార్చాలని BRS నిర్ణయం..

Mynampally MLA Ticket Issue : బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్​.. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా​ విడుదల చేసిన వేళ కొందరు నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఈ జాబితాలో మల్కాజిగిరి ఎమ్మెల్యే(Mynampally Hanumanth Rao) కూడా చేరారు. ఎమ్మెల్యే టికెట్​ తనకు ఇచ్చినా తన కుమారుడికి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. తన కుమారుడు రోహిత్​కు.. ముఖ్యమంత్రి కేసీఆర్ టికెటు ఇస్తే గెలిపించుకొని వస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు. సోమవారం రోజున తన వ్యక్తిగత అభిప్రాయాలు తిరుమలలోని స్వామివారి సన్నిధిలో చెప్పుకున్నానని తెలిపారు.

BRS To Take Back MLA Mynampally Ticket 2023 : అయితే మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా.. ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని.. బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతో పాటు.. మెదక్‌ నుంచి తన కుమారుడికి టికెట్‌ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హన్మంతరావు సోమవారం ప్రకటించారు. అంతేకాకుండా మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేశారు. తీరా బీఆర్ఎస్ జాబితాలో మైనంపల్లి పేరు ఉంది.

BRS To Drop Rebel Mynampally : అభ్యర్థులపై.. స్పష్టత ఇచ్చినా రెండు స్థానాల నుంచి పోటీ చేస్తామని చెప్పడం, హరీశ్‌రావుపై చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్ఠానం.. మల్కాజిగిరికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మర్రి రాజశేఖర్‌రెడ్డితో పాటు.. మరో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో అంచనాకు వచ్చిన తర్వాత.. నిర్ణయం వెల్లడించనున్నట్టు తెలిసింది.

MLA Mynampally on Harish Rao : మెదక్​ టికెట్​ సిట్టింగ్​ ఎమ్మెల్యేకే.. హరీశ్‌ రావుపై తీవ్ర విమర్శలు చేసిన మైనంపల్లి

మైనంపల్లితో కాంగ్రెస్‌ నాయకులు మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. హస్తం పార్టీలో ఇప్పటికే ఉన్నవారికి, సీనియర్‌ నాయకులకి కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇవ్వడానికి అధిష్ఠానం ఆసక్తి చూపట్లేదు. గత ఎన్నికల్లో అనివార్య పరిస్థితుల్లో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దంపతులకు మాత్రమే ఆ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి పయనం ఎటువైపు అనేది చర్చనీయాంశంగా మారింది.

BRS Focus on Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ టికెట్‌పై తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్పానని.. మైనంపల్లి హన్మంతరావు(Malkajgiri MLA) వెల్లడించారు. హైదరాబాద్‌ వెళ్లాక.. మెదక్‌, మల్కాజిగిరి ప్రజలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తన కుమారుడి రాజకీయ భవిష్యతే తనకు ముఖ్యమని తెలిపారు.

తిరుమలలోని వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మొదటి సారిగా రాజకీయాలు మాట్లాడానని.. తన జీవితంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా తనను ఇబ్బంది పెడితే కచ్చితంగా బదులు ఇస్తానని స్పష్టం చేశారు. తాను పార్టీ గూరించి మాట్లాడలేదని.. మెదక్ నియోజకవర్గ కార్యకర్తలు, మల్కాజిగిరి కార్యకర్తలే తనకు ప్రాధాన్యమని వెల్లడించారు. తాను ఏ పార్టీని విమర్శించనని, పార్టీలకు అతీతంగా ఉంటానని వివరించారు.

MLA Mynampally Latest Comments : 'నన్ను ఇబ్బంది పెడితే.. రియాక్షన్ ఇలాగే ఉంటుంది'

KTR Tweet on BRS Candidates List : టికెట్​ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామన్న కేటీఆర్.. మైనంపల్లి వ్యాఖ్యలపై సీరియస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.