ETV Bharat / state

కూతురిపై 'ప్రేమ' అల్లుడుని హతమార్చింది

ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు కూతుర్ని మంచిగా చూసుకుంటాడనుకున్నాడు ఆ తండ్రి. కానీ బిడ్డ కుటుంబ కలహాలతో పుట్టింటికి రావడం వల్ల... అతనిలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెపై ప్రేమ ప్రతికారేచ్ఛను పెంచి అల్లుడిని అతికిరాతకంగా చంపేలా చేసింది.

అల్లుడుని చంపిన మామ
author img

By

Published : May 13, 2019, 8:08 PM IST

మేడ్చల్ జిల్లా బాలానగర్​లో నివాసముంటున్న అమీర్... కైసర్ నగర్​లో నివాసముండే హీనా బేగంను 15 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో బాలానగర్ పోలీసుల సాయంతో హీనా పాపతో పుట్టింటికి వెళ్లిపోయింది.

అల్లుడుని చంపిన మామ
ఈనెల 11వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో అమీర్ భార్యను, పాపను పలకరించడానికి మామ ఇంటికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో కూతురి విషయమై మామ, బావమరిది కలిసి అమీర్​తో ఘర్షణకు దిగారు. ఆగ్రహానికి లోనైనా హీనా తండ్రి డంబెల్​తో అతనిపై దాడి చేశాడు. అతికిరాతకంగా తలపై మోదాడు. అనంతరం తండ్రి, అతనికి సహకరించిన కొడుకు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్​కు తరలించారు.

Intro:Hyd_TG_32_14_Murder at kaisar nagar_ACP_PC_C29

మేడ్చల్ : దుండిగల్
అల్లుడుని అతికిరతకంగా హత్య చేసి, జైలు పాలైన తండ్రి కొడుకులు..

Body:యాంకర్ : ప్రేమించి పెళ్లి చేసుకుని తమ కూతురిని అల్లుడు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సహించలేక దారుణంగా హతమార్చి జైలు పాలైన తండ్రి కొడుకు ఈ సంఘటన దుండిగల్ పిఎస్ పరిధి కైసర్ నగర్ లో జరిగింది..
వాయిస్ : ఐడిపీఎల్ గురుమూర్తి నగర్ బాలానగర్ లో నివాసముంటున్న అమీర్ 26 కైసర్ నగర్ లో నివాసముండే హీనా బేగంను 20 ప్రేమించి 15 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.. వీరికి మూడు నెలల పాప వుంది.. కుటుంబ కలహాలతో బాలనగర్ పోలీసుల సహాయంతో పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.. ఈ గ్రామంలో 11వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో అమీర్ భార్యను పాపను పలకరించడానికి మామ ఇంటికి కైసర్ నగర్ వెళ్ళాడు..
అక్కడ మామ, బావమరిది ఇస్మైల్ తో తో కుటుంబ విషయమై వీరి ఘర్షణ జరిగింది.. దీంతో మా కూతుర్ని పెడుతున్నావ్ అంటూ మామ మరియు బావమరిది ఇస్మాయిల్ ఇంటి అల్లుడైన అమీర్ (26)ను అతి కిరాతకంగా రాడ్ తో తలపై బలంగా మోది హత్య చేసి అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు నిందితులను రిమాండ్కు తరలించారు

Conclusion:బైట్ : నరసింహారావు, ఏసిపి పెట్ బషీరాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.