Mother Suicide At Medchal : చిన్న చిన్న కలహాలు పచ్చని కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలు జీవితాలకు శాపాలుగా మారుతున్నాయి. పరిష్కారమయ్యే సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి మరణాలకు స్వాగతం పలుకుతున్నారు. కలిసి ఉండాల్సిన కుటుంబాలు వారి మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలతో చేజేతులా హతమార్చుకుంటున్నారు. వారితో పాటు కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో చదువుకో చదువుకో అంటూ పిల్లలను తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం చదివించే స్తోమత లేక అర్ధాంతరంగా మాన్పించేస్తున్నారు. పిల్లలు వినకపోతే తాము చనిపోతామంటూ బెదిరిస్తున్నారు. ఆఖరికి ఆత్మహత్యకు పాల్పడుతూ వారి జీవితాలను ముగించుకోవడమే కాకుండా పిల్లల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఓ తల్లికి తన కుమార్తె చదువుకోవడం ఇష్టం లేదు. చదవడం వల్ల కుమార్తె ఒత్తిడికి గురవుతుందని, తరచూ ఆమెతో గొడవ పడుతూ ఉండేది. ఎంత చెప్పినా కూతురు వినడం లేదని చివరికి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆ కుమార్తె ఆశయం వేరు, ఆమె తల్లి ఆలోచన వేరు. ఈ రెంటింటి మధ్య నలిగిపోతున్న తండ్రి వారికి దూరంగా ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. కుమార్తె తను చెప్పిన మాట వినడం లేదని ఆ తల్లి తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరిసారిగా దైవదర్శనం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఎల్లంకి భాస్కర్ (38) లావణ్య (37)లకు 2004లో పెళ్లయ్యింది. వారికి ఇద్దరు సంతానం. కుమార్తె శ్రీజ, కుమారుడు అశ్విత్ ఉన్నారు. కుమారైకు హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ సీటు రావడంతో చదువు కోసం పోచారంలోని సద్భావన్ టౌన్ షిప్‌కు వారి కుటుంబం వచ్చి నివాసముంటున్నారు. తల్లికి మాత్రం కుమారై ఎంబీబీఎస్ చదవడం ఏమాత్రం ఇష్టం లేదు.
Mother Committed Suicide in Medchal : కుమార్తెకు ఆరోగ్యం బాగుండదని, ఒత్తిడి బాగా ఉండే ఆ చదువు ఆమెకు వద్దని ఎప్పుడు వారిస్తోంది. పలుమార్లు ఈ విషయంపై కుమారై, భర్తతో బాగా గొడవ జరిగింది. ఈ క్రమంలో కొద్ది నెలలుగా భాస్కర్ హనుమకొండకు వెళ్లి ఒంటరిగా ఉంటూ వ్యాపారం చేస్తున్నారు. కుటుంబం దగ్గరకు ఆయన అప్పడప్పుడు వచ్చివెళ్లేవాడు. అలాగే ఈనెల 25వ తేదీన కూడా వచ్చాడు.
భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి వేములవాడకు వెళ్లి 26వ తేదీన తిరిగి ఇంటికి వచ్చారు. కుమార్తె చదువుపై వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తల్లి లావణ్య ఎవరికి చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యప్తు చర్యలు చేపట్టారు.
Mother commits suicide with Children : ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య