మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గల ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాతో పాఠశాలలు ముందుగానే లాక్డౌన్ చేయడం వల్ల ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, పాఠశాల బిల్డింగ్ పన్నులు కట్టలేకపోతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సంవత్సరంలో పాఠశాలలకు తాళాలు వేయడం వల్ల ఎటువంటి లావాదేవీలు లేవని అందుకు ప్రైవేట్ పాఠశాలలకు ట్యాక్స్ ఈ సంవత్సరానికి గాను రాయితీ ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు ఉద్యోగ భృతి కింద నెలకు 10 వేల రూపాయలు ఇప్పించి ఆదుకోవాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే వివేకానంద ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకెళ్తానన్నారు.
ఇదీ చూడండి: రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!